SRD: బ్రాహ్మణ కులాన్ని అవమానించే ఉద్దేశంతో పాడిన జీడి సారయ్యను వెంటనే అరెస్టు చేయాలని బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సంగారెడ్డిలో నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు రవిశంకర్, లీగల్ సెల్ కన్వీనర్ విజయభాస్కర్, వరదాచార్యులు, శ్యామ్ రావు, వసంతరావు, సురేష్ జోషి, శిరీష, అశోక్ కులకర్ణి పాల్గొన్నారు.