KDP: పులివెందులలోని అంగళ్లలో ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలు తెలిపారు. సోమవారం స్థానిక మెయిన్ రోడ్డులో ఉన్న తోపుడు బండ్లు, హోటల్లు, కూరగాయల బండ్ల వారు ప్రభుత్వ నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.