TPT: లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాలు వాపుతో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు చెప్పడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత జైలుకు తీసుకెళ్లనున్నారు.