నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జేసీ వెంకటేశ్వర్లుకు 40 మంది కార్పొరేటర్లు తీర్మానం నోటీసును అందజేశారు. స్రవంతిని తొలగించి కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 మంది సభ్యులు ఉండగా.. డిప్యూటీ మేయర్ ఖలీల్ రాజీనామాతో ఒక స్థానం ఖాళీ అయ్యింది.