HNK: జిల్లా కేంద్రంలో 2014లో ప్రారంభమైన కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లోపం, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.