AP: కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ మూడ్రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో కడపలో పర్యటించనున్నారు. 25న మధ్యాహ్నం బెంగళూరు నుంచి పులివెందులకు రానున్న జగన్.. క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్, 26న వివాహ వేడుక, పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే, 27న పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లనున్నారు.