ముంబై 26/11 దాడికి ఆపరేషన్ సింధూర్లా బుద్ధి చెప్పి ఉంటే మరోసారి మన దేశంపై ఎవరూ దాడికి ప్రయత్నించే వారు కాదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర అన్నారు. కానీ అప్పటి ప్రభుత్వాలు అలా చేయలేదని మండిపడ్డారు. అప్పటి దాడి భారతదేశ సార్యభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న అతిపెద్ద ఉగ్రదాడిగా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ప్రతి ఒక్కపౌరుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.