KNR: హుజూరాబాద్ నుంచి అరుణాచలానికి డిసెంబర్ 1వ తేదీన స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. దీనికి పెద్దలకు చార్జీలు రూ. 4600, పిల్లలకు రూ. 3500 ఉంటుందని అన్నారు. మరిన్ని వివరాలకు డిపో కార్యాలయంలో సంప్రదించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు.