E.G: గోకవరం మండల కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన దేవీపట్నం గ్రామానికి సంబంధించిన 120 మంది లబ్ధిదారులు చేస్తున్న దీక్ష ఆదివారానికి ఆరవ రోజుకు చేరుకుంది. 120 మంది లబ్ధిదారులకు గృహాలను త్వరగా పూర్తిచేసి మౌలిక వసతులు కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే, భూమి కోల్పోయిన వారికి భూమిని ఇవ్వాలన్నారు.