WGL: గీసుకొండ మండలం మరియపురంలో ఎరువు తయారీ పర్యవేక్షణకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శి పిల్లి సరితపై గ్రామానికి చెందిన రంపిస మధన్ మోహన్, కౌడగానీ రాజు కుమార్, ఆడెపు సురేష్, కౌడగానీ జితేందర్ దురుసుగా ప్రవర్తించి దాడి చేశారు. ఈ ఘటనపై గీసుకొండ పోలీస్ స్టేషన్లో వారిపై ఇవాళ కేసు నమోదు చేశామని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.