భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలో స్వర్ణ రథం ఊరేగింపు కనుల పండువగా జరిగింది. ప్రశాంతి నిలయం నుంచి హిల్ వ్యూ స్టేడియం వరకు జరిగిన ఈ శోభాయాత్రలో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గమంతా ‘సాయిరాం’ నామ స్మరణతో మార్మోగింది.