RR: మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందగా.. ఫోటోగ్రాఫర్ లోకేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, తలకు తీవ్ర గాయమైన హోండా కారు డ్రైవర్ వెంకట్ నిన్న మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.