»Constable And Three Others Died Due To Sunstroke Telangana May 26th 2023
Sunstroke: వడదెబ్బకు కానిస్టేబుల్ సహా ముగ్గురు మృతి
రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.
తెలంగాణ(telangana) రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బ(sunstroke)కు తట్టుకోలేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వృద్ధుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా, శుక్రవారం కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. మృతి చెందినవారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఉపాధి పనులు చేసుకునే ఓ మహిళ, ఓ కానిస్టేబుల్, 78 ఏళ్ల వృద్ధురాలు వడ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన మధుకర్(41) కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పిల్లల చదువురీత్యా కరీంనగర్(karimnagar)లో ఉంటున్నాడు. పోలీసు విధుల్లో భాగంగా అతను నాలుగు రోజులుగా ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద గన్ మెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. అయితే ఆ సమయంలో ఎండలో నిలబడి అతనికి వడదెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆ క్రమంలో గురువారం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకున్నాడు. మరుసటిరోజు ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు స్నానానికి వెళ్లి బాత్రూమ్ లోనే పడిపోయి చనిపోయాడు. చికిత్సకు తరలిద్దామని చూసేలోపే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఖమ్మం(khammam) జిల్లాలోని కారేపల్లి మండలం తులిస్యా తండాకు చెందిన వాంకుడోత్ సునీత(35) శుక్రవారం ఉపాధి కూలి పనికి వెళ్లింది. ఎండలో ఎక్కువసేపు పనిచేయడంతో ఆమెకు వడ దెబ్బ తగిలింది. అనారోగ్యానికి గురైన సునితను..ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. జగిత్యాల జిల్లాలో రాయికల్ సిటీకి చెందిన కలమడుగు మల్లవ్వ(78) తన రేకుల ఇంట్లో పడుకుంది. ఎండ తీవ్రత, వడగాడ్పులతో ఆమెకు వడదెబ్బ తగిలింది. దాంతో అనారోగ్యానికి గురై మృతి చెందింది.