NLR: కావలి మండలం ముసునూరులోని మందాడి చెరువు నీటిలో సుమారు 35-45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం లభ్యమయింది. దీనిపై గ్రామ వీఆర్వో P. శ్రీనివాసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కావలి రూరల్ ఎస్సై బాజిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.