HNK: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని VCK పార్టీ యూత్ విభాగం నాయకుడు అంబాల అనిల్ కుమార్ ఇవాళ హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య విన్న MLA వెంటనే స్పందించి, త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. VCK పార్టీ నేతలు ఉన్నారు.