NGKL: మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బల్మూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందజేస్తున్నట్లు తెలిపారు.