నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని.. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఖతమవడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వం ముందుగా నిర్వహించాలని భావిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో కావడం తథ్యమని జోస్యం చెప్పారు.