VZM: రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ప్రసాదరావుకు రాయలసీమ యూనివర్సిటీ డాక్టరేట్ లభించినట్లు ప్రిన్సిపాల్ స్వప్నహైందవీ శనివారం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మానవ వనరుల అభివృద్ధి పద్ధతులపై చేసిన పరిశోధనకుగాను డాక్టరేట్ ఇచ్చినట్టు చెప్పారు. కాగా ఇటీవల కర్నూలులో జరిగిన 4వ స్నాతకోత్సవంలో ఆయన పట్టా అందుకున్నారు.