కృష్ణా: ఐ లవ్ గుడివాడ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనుల మెరుగుకు గౌతమ్ విద్యాసంస్థల ఛైర్మన్ కొసరాజు అవినాష్ రూ.20 లక్షల విలువ చేసే రెండు ట్రాక్టర్లను పురపాలక సంఘానికి అందింజేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా ట్రాక్టర్ల పత్రాలను మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్‌కు శనివారం అందించారు. అనంతరం ఎమ్మెల్యే జెండా ఊపి రెండు ట్రాక్టర్లను ప్రారంభించారు.