ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయసు 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST, OBC, PwD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉడనుంది. ఈ పోస్టులకు టెన్త్ పాసైన వారు అర్హులు. నెలకు రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.mha.gov.in/enను సంప్రదించవచ్చు.