ఖమ్మం వన్ టౌన్లో ఉన్న ప్రధాన సమస్యలపై బీజేపీ వన్‌టౌన్ అధ్యక్షుడు గడీల నరేష్ ఆధ్వర్యంలో శనివారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందించారు. అనునిత్యం రద్దీగా ఉండే ముస్తఫానగర్ గుర్రాల బొమ్మ సెంటర్ వద్ద రోడ్డు మార్గ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు.