BPT: సంతమాగులూరు మండలం, ఏల్చూరులో శనివారం ఉదయం కొండచిలువ కలకలం సృష్టించింది. నార్కెట్పల్లి జాతీయ రహదారి సమీపంలో కనిపించిన ఆ పామును చూసి స్థానికులు భయపడ్డారు. వెంటనే ప్రజలు కర్రలతో కొట్టి ఆ కొండచిలువను చంపేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఆ పాము కళేబరాన్ని గ్రామానికి దూరంగా పారేశారు.