ATP: గుత్తిలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు గంటపాటు అకాల వర్షం కురిసింది. 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు శనివారం తెలిపారు. పంట కాలం పూర్తయ్యాక వర్షాలు రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తడంతో పట్టణంలోని ప్రజలు సైతం అవస్థలు పడ్డారు.