GNTR: ఫిరంగిపురం శివారులోని గోకుల్ టీ స్టాల్ వద్ద శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. పుట్టకోటకు చెందిన కళ్యాణ్ గుంటూరుకు వెళ్తుండగా, టీ స్టాల్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.