ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరని పేర్కొన్నారు.