ADB: వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. 4 రోజుల వ్యవధిలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువులు లోకం చూడకుండానే కన్నుమూశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా పట్టించుకోరని ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. మంచిర్యాలలో రెండు పసిప్రాణాలు, నిర్మల్లో ఒకరు, ఆదిలాబాద్లో తల్లీ బిడ్డ చనిపోయారు.