MBNR: బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి, హేమాజీపూర్, మోతీఘనపూర్, ఉడిత్యాల సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.