VZM: మార్గశిర, ధనుర్మాసం పుణ్య దినాలు పురస్కరించుకుని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ద్వారక తిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరంల దర్శనం కొరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. టికెట్ ధర ₹1970 /- మాత్రమేనని. ప్రతి శనివారం సా.8 గంటలకు బయలుదేరి సోమవారం ఉ 5గంటలకు విజయనగరం చేరుననన్నారు.