TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను MLA కడియం శ్రీహరి కలిశారు. ఫిరాయింపు అనర్హతపై ఈనెల 23న హాజరుకావాలని స్పీకర్ ఆయనకు నోటీసులు పంపించారు. అయితే గడువుకు ముందే కడియం స్పీకర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చినట్లు తెలుస్తుంది. కడియం లేఖపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.