NLG: జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. నల్గొండ పట్టణంలోని చర్లపల్లి సెక్టార్ పరిధిలో ఇవాళ అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణీలకు బాల్య వివాహాలు, అక్రమ దత్తత, బాలికలపై లైంగిక వేధింపుల నిరోధంపై అవగాహన కల్పించారు.