చలికాలంలో పెరుగు తినడం వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి. పెరుగును మితంగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్, ఎసిటిడీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎక్కువగా పెరుగు తింటే జలుబు, దగ్గు, ఆయాసం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయట. రాత్రిపూట తింటే జీర్ణ సమస్యలు, అలెర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది.