AP: తిరుపతిలో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.