Nothing Phone 2 confirmed to launch in July; battery capacity revealed
Nothing Phone 2: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించేవారే. వినియోగదారులు పెరుగుతుండటంతో తయారీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అలా వచ్చిందే నథింగ్. గత ఏడాది ఈ సంస్థ ఓ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఫోన్ని మార్కెట్లోకి తీసుకురాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోన్ తన రెండో మొబైల్ ని విడుదల చేయడానికి రెడీ అయ్యింది.
నథింగ్ ఫోన్ 2 ని (Nothing Phone 2) జులైలో మార్కెట్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో కార్ల్ పే వెల్లడించారు. కంపెనీ పేరు చూసి ఫోన్ ని మాత్రం తక్కువ అంచనా వేయకండి. నిజంగా ఈ ఫోన్ నంథింగ్ కాదు, ఫీచర్లు వింటే సంథింగ్ స్పెషల్ అని ఫీలౌతారు. నథింగ్ ఫోన్ 1తో (Nothing Phone 1) పోలిస్తే ఫోన్ 2 బ్యాటరీ సామర్ధ్యం అధికంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
నథింగ్ ఫోన్ 2 4700ఎంఏహెచ్ బ్యాటరీతో కస్టమర్ల ముందుకొస్తుందని వెల్లడించారు. ఇది లేటెస్ట్ ఐఫోన్ 14 ప్రొ (3200ఎంఏహెచ్) ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ (4323ఎంఏహెచ్) బ్యాటరీ సామర్ధ్యం కంటే అధికం. అండ్రాయిడ్లో ఫోన్ 2 భారీ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండటం కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. భారీ బ్యాటరీ సామర్ధ్యంతో ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుండటం సానుకూల అంశంగా చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది.