GNTR: తెనాలి ఐతానగర్‌లోని లింగరావు సెంటర్ వద్ద గురువారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలుపై రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న గిట్టుబాటు ధరకి ధాన్యం విక్రయంచాలని, 24 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రి రైతులకు తెలియజేశారు.