AKP: ఎలమంచిలి పట్టణం ధర్మవరంలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను ఈ నెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు కొఠారు సాంబశివరావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి గురువారం ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. మూడవ శుక్రవారం వెయ్యి మంది స్త్రీలతో కుంకుమార్చన, 4వ శుక్రవారం లక్ష పుష్పాలతో పూజలు జరుగుతాయన్నారు.