ADB: న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అత్యంత గౌరవకరమైందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం తెలిపారు. ఈ పురస్కారం మనందరికీ ప్రేరణ అని చెప్పారు. దేశవ్యాప్తంగా జల సంరక్షణకు ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. నీటి సంరక్షణ ప్రచారం వంటి విస్తృత చర్యల ఫలితంగానే ఈ జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.