HYD: డేటింగ్ యాప్ల ద్వారా పరిచయాలు పెంచుకుని, నమ్మకం కలిగిన తర్వాత మత్తు పదార్థాల రుచి చూపించి, యువతను గంజాయి, ఇతర డ్రగ్స్ వలయంలోకి లాగుతున్న ఘటనలు హైదరాబాద్లో పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు పలుచోట్ల నమోదవుతున్న నేపథ్యంలో, అపరిచితులతో పరిచయాలు పెంచుకునే విషయంలో యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.