JGL: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లాకు అధికారులను నియమించింది. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడినిగా పీ. వెంకట్ రెడ్డిని, వ్యయ పరిశీలకుడినిగా ఎం. మనోహర్‌ను నియమిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.