రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చెందిన మరిన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈడీ ఇప్పటికే రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.1,400 కోట్లుగా ఉండవచ్చని అంచనా. కాగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA) కింద ఈ చర్యలు కొనసాగుతున్నాయి.