MDCL: జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజినీరింగ్ విద్యార్థినులకు తక్షణ ఉద్యోగాలు కల్పించడానికి ఎమర్టెక్ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన 40 మంది పేద, మధ్యతరగతి విద్యార్థినులకు ఆరు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ. 6 లక్షల వరకు వేతనం లభించనుంది.