KRNL: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని జిల్లా కలెక్టర్ ఎ.సిరి బుధవారం తెలిపారు. పత్తిలో 14 శాతం తేమ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా కొనుగోళ్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా పత్తి కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లోకల్ విత్తనాలు వాడకూడదన్నారు.