W.G: సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా అరికట్టాలని నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద పిలుపునిచ్చారు. తీరప్రాంత రక్షణలో భాగంగా గురువారం జరగనున్న ‘సాగర్ కవచ్’ మాక్ డ్రిల్‌పై బుధవారం తన కార్యాలయంలో మెరైన్, సివిల్ పోలీసులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. దేశ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని, తీరంలో అనుమానిత కదలికలపై డేగకన్ను వేయాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు.