AP: ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో హిడ్మా మృతదేహానికి నిన్న రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను సోదరుడు, బంధువులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి(హిడ్మా స్వగ్రామం)లో అంత్యక్రియలు జరగనున్నాయి.