GNTR: శంకరవిలాస్ వంతెన అభివృద్ధిపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనుల సమయంలో కొంత అసౌకర్యం సహజమేనని, దీనిపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని అన్నారు.