కోనసీమ: అల్లవరం మండలం గోడి లంక పీహెచ్సీ వైద్యాధికారి కె.బాలరాజు వ్యవహరిస్తున్న తీరుపై బుధవారం రాత్రి అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకి సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఏఎన్ఎం, ఎంపీహెచ్ఎస్, ఆశా వర్కర్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యేలా బాలరాజు వ్యవహరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.