కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు సందర్భంగా ఓ భక్తుడు చేతివాటం ప్రదర్శించాడు. వాసంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి సుమారు 60 వేల రూపాయలను దొంగిలించి, వాటిని తన బైక్ ట్యాంకర్ కింద దాచుతుండగా సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. ఆలయ ఈఓ చక్రధరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు