»It Raids Across Tamil Nadu In Around 40 Locations On Minister Senthil Balaji Houses Also
IT Raids మళ్లీ కలకలం:. మంత్రి లక్ష్యంగా ఐటీ సోదాలు.. తీవ్ర ఉద్రిక్తత
ఆగ్రహం కట్టలు తెంచుకున్న కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరాభవం ఎదురవడంతో సోదాలు చేయకుండానే వారు వెనుదిరిగారు. కాగా ఈ దాడిని ఐటీ శాఖ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల (Investigation Agencies) దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ (Telangana), పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడులో (Tamil Nadu) తరచూ ఐటీ (IT), సీబీఐ (CBI), ఈడీ (ED) సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి తమిళనాడులో ఐటీ దాడులు కలకలం రేపాయి. అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు జరిగాయి. మొత్తం 125 ప్రాంతాల్లో తనిఖీలు (Raids) నిర్వహించారు. చెన్నై (Chennai), కోయంబత్తూరు (Coimbatore) సహా ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ సోదాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
ఆదాయపు పన్ను (Income Tax Raids) అధికారులు తమిళనాడులో శుక్రవారం ఉదయమే తనిఖీలు చేపట్టారు. మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) ఇంట్లో ఐటీ శాఖ అధికారులు బృందాలుగా వచ్చి సోదాలు చేశారు. మంత్రితోపాటు ఆయనకు సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు (Contractors), బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా మంత్రి సోదరుడు అశోక్ నివాసానికి వెళ్లగా ఐటీ బృందాన్ని కుటుంబసభ్యులు, అనుచరులు అడ్డుకున్నారు. కారూర్ జిల్లాలోని (Karur District) అశోక్ (Ashok) ఇంటి వద్ద డీఎంకే పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కార్యకర్తలు (Karyakartas) ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరాభవం ఎదురవడంతో సోదాలు చేయకుండానే వారు వెనుదిరిగారు. కాగా ఈ దాడిని ఐటీ శాఖ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులకు (Police) ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా తమిళనాడులో కొంతకాలంగా తరచూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులను అధికార పార్టీ డీఎంకే (DMK) తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ ఇలాంటి దాడులు చేస్తోందని డీఎంకే పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోదీకి (Modi) వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడంతోనే కక్షపూరితంగా ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.