TG: ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు ఆత్మగౌరవం లభిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఆడబిడ్డకు పుట్టింటి సారె లాగా చీరలు ఇస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మార్చి 8 నాటికి కోటి మంది ఆడబిడ్డలకు చీరలు ఇస్తామని ప్రకటించారు. ముందుగా గ్రామాల్లో.. ఆ తర్వాత పట్టణాల్లో పంచుతామని వెల్లడించారు.