KMR: స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులకు అన్ని పార్టీలు అధిక సీట్లు కేటాయించాలని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గజ్జల బిక్షపతి సూచించారు. శుక్రవారం మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బిక్కనూర్ మండలం జంగంపల్లిలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.