సోషల్ మీడియా (Social media) ఆన్లైన్లో డేటా చౌర్యం,మోసాలు పెరుగుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store)లో చాలా ప్రమాదకరమైన యాప్లు ఉన్నాయి అనేక యాప్లను నిషేధించింది. తాజగా టెక్ దిగ్గజం గూగుల్ ఓ ప్రమాదకర యాప్ ను గుర్తించి, దాన్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇది ఒక రికార్డింగ్ యాప్(Recording app). దీని పేరు ఐరికార్డర్-స్క్రీన్ రికార్డర్. దీన్ని ఒకసారి డౌన్ లోడ్ చేసుకుంటే, కొరివితో తల గోక్కున్నట్టేనని సైబర్ భద్రతా (Cyber security)సంస్థలు చెబుతున్నాయి. ఈ యాప్ ప్రతి 15 నిమిషాలకు ఓసారి ఆడియో రికార్డింగ్ చేసి తన డెవలపర్ (Developer) కు పంపిస్తున్నట్టు గుర్తించారు. ఇది ఫోన్ లో ఉన్న కాల్ లాగ్స్, కాంటాక్ట్స్ లోకి చొరబడుతుందని, టెక్ట్స్ మెసేజులు, ఫైల్స్ లిస్ట్, డివైస్ లొకేషన్, ఎస్సెమ్మెస్ లు పంపడం, ఆడియో రికార్డింగ్(Audio recording), ఫొటోలు తీయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతుందని వివరించారు. మొబైల్ (Mobile)లోని మైక్రోఫోన్ ను తన అధీనంలోకి తెచ్చుకుని ఆడియో రికార్డ్ చేస్తుందని, ఫోన్ లోని ప్రత్యేకమైన ఫైళ్లను కూడా తస్కరిస్తుందని స్టెఫాంకో వివరించారు.